గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.ప్రతాపరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. విశాఖ జిల్లా అనకాపల్లి వద్ద క్వారీలో అక్రమాల వ్యవహారంలో ఆయనను సస్పెండ్ చేశారు. అనకాపల్లి మండలంలోని సర్వే నెంబరు 75లో ఉన్న 9 ఎకరాల క్వారీ లీజులకు సంబంధించి తనిఖీ చేయకపోవటం, అక్రమాలకు పాల్పడేలా వ్యవహరించటంపై అంతర్గత విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆయనపై చర్యలకు సిపారసు చేశారు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ గనులశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి