ETV Bharat / state

ఎస్కార్ట్​తో వలస కూలీల తరలింపు - migrant labors latest news in visakha district

లాక్​డౌన్​ కారణంగా విశాఖ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలను వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మార్గం మధ్యలో ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రత్యేక పోలీస్ వాహనం ఎస్కార్ట్​తో వలసదారులను పంపించారు.

ఎస్కార్ట్​తో వలస కూలీలు తరలింపు
ఎస్కార్ట్​తో వలస కూలీలు తరలింపు
author img

By

Published : May 1, 2020, 5:08 PM IST

విశాఖ జిల్లా సరిహద్దులో లాక్​డౌన్​ వల్ల చిక్కుకుపోయిన వలస కూలీలను తరలించే ప్రక్రియ జరుగుతోంది. జిల్లా యంత్రాంగం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వలసదారులను స్వస్థలాలకు తరలిస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వలస కూలీలను ప్రత్యేక పోలీస్ వాహనం ఎస్కార్ట్​తో పంపించారు. మధ్యలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్​పోస్ట్​ల వద్ద ఇబ్బంది రాకుండా ముందుగానే వారికి సమాచారం అందిస్తున్నారు. ఈ ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు.

ఇదీ చూడండి: 'వలస కూలీలు, రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.