ETV Bharat / state

శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని వినతి

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ... వ్యాపార సంస్థలు తమ ప్రాంగణాల్లో వినియోగదారులకు తప్పనిసరిగా శానిటైజర్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారుల హక్కుల రక్షణ కమిటీ ప్రతినిధులు కలెక్టర్‌ వినయ్‌చంద్‌ను కోరారు. గత అయిదు నెలలుగా కొవిడ్‌ సేవల్లో పాల్గొంటున్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు శాలువా కప్పి సత్కరించారు.

Members of the Consumer Rights Protection Committee honored Collector V Vinay Chand
కలెక్టర్​కు వినతి పత్రం అందజేత
author img

By

Published : Aug 25, 2020, 8:47 AM IST

విశాఖ జిల్లాలో కొవిడ్ - 19ను అరికట్టేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న కలెక్టర్ వి.వినయ్ చంద్​ను వినియోగదారుల హక్కుల రక్షణ కమిటీ సభ్యులు సత్కరించారు. అనంతరం కరోనా వ్యాప్తి నివారణకు అన్ని వ్యాపార సంస్థలు... వినియోగదారులకు తప్పనిసరిగా శ్యానిటైజర్ ను అందుబాటులో ఉంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. అందరూ మాస్కులను ధరించేలా అవగాహన కల్పించాలని కోరారు. కమిటీ ప్రతినిధులు కోనాడ సుదర్శన్, జి.ఆర్‌.ప్రభు కిరణ్, మారియా, హిల్డా మాథ్యూ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

సాంకేతికత వినియోగంలో మేటి కానీ... పాలనలో పారదర్శకతలేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.