మీడియా పై ప్రభుత్వం విధించిన ఆంక్షలు వెంటానే ఎత్తివేయాలని,విశాఖ కలెక్టరేట్ ఎదుట మీడియా సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా నిరంతరం శ్రమించే మీడియాపై ఆంక్షలు విధించటం సమంజసం కాదని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రి అవంతి శ్రీనివాస్ ను మీడియా ప్రతినిధులు అడ్డుకున్నారు. అనంతరం మీడియా పై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేసి, మీడియా స్వేచ్ఛను కాపాడాలని కోరారు.
ఇదీ చదవండి:ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్ధుల ధర్నా