ETV Bharat / state

మావోయిస్టులకు వ్యతిరేకంగా మన్యంలో పోస్టర్లు !

author img

By

Published : Jul 25, 2020, 6:06 PM IST

మావోయిస్టుల వారోత్సవాలు ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసి అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో యువకులు గోడపత్రికను విడుదల చేశారు. ఇన్‌ఫార్మర్‌ల నెపంతో గిరిజనులను పొట్టన పెట్టుకుని.. వారోత్సవాలు ఎలా జరుపుకుంటారని గిరిజన యువకులు ప్రశ్నించారు.

mavo anti posters
mavo anti posters

విశాఖ మన్యంలో మావోయిస్టులు జరుపుకునే వారోత్సవాలను ప్రోత్సహించడం తగదని విశాఖ జిల్లా ఆదివాసి అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో యువకులు గోడ పత్రికను విడుదల చేశారు. విశాఖ మన్యంలో పలు గ్రామాల్లో వీటిని అతికించారు. మావోయిస్టుల వారోత్సవాలు ఈనెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివాసీ గిరిజన యువకులంతా వీటిని వ్యతిరేకిస్తూ.. గోడపత్రికను విడుదల చేశారు. గిరిజనులను చంపి.. వారోత్సవాలు ఎలా జరుపుకుంటారంటూ ప్రశ్నించారు. విస్తరిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను.. తమకు ఉపయోగించుకోనివ్వకుండా.. అడ్డుకోవడం తగదన్నారు. సమాచార వ్యవస్థను ధ్వంసం చేయడంలో భాగంగానే సెల్ టవర్ కూల్చివేయడం, గిరిజన గ్రామాలకు రహదారులను నిర్మించకుండా చేయడం వంటి ప్రగతి నిరోధకాలను చేపడుతూ.. వారోత్సవాలు జరుపుకోవడం ఎంతవరకు సబబని ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చదవండి: శిరోముండనం చేసిన యువకుడిని.. ఆ రోజు రాత్రి ఇలా కొట్టారా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.