విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం భారీగా మాస్కుల తయారీ పనిని అప్పగించింది. లక్ష మాస్కుల తయారీకి ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వటంతో మహిళలకు చేతి నిండా పని దొరికినట్లయ్యింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతి ఇంటికీ ఉచితంగా మాస్కులు ఇవ్వాలని నిర్ణయించటంతో, వీటిని కుట్టే బాధ్యత డ్వాక్రా మహిళలకు అప్పగించింది. దీంతో లాక్డౌన్ కారణంగా పనుల్లేక ఖాళీగా ఉన్నవారికి కొంత ఉపాధి కల్పించినట్లయ్యింది..
ఫ్యాషన్ టెక్నాలజీ కేంద్రాల ద్వారా స్వయం సహాయక సంఘాల్లో మహిళలకు శిక్షణ ఇచ్చి, మాస్కులు తయారీ చేయిస్తున్నారు. ఇంటి వద్దే ఉంటూ, మాస్కులు తయారీ చేసుకునేందుకు మహిళలకు అవకాశాన్ని కల్పించారు. మాస్కు తయారీకి కావల్సిన ముడిసరుకు అందిస్తున్నారు. ఒక్కో మాస్కు తయారీ చేసినందుకు రెండున్నర రూపాయల చొప్పున మహిళలకు చెల్లిస్తున్నారు. తయారీ మాస్కులకు ఎప్పటికప్పుడు ఛార్జీ చెల్లిస్తున్నారు.
ఇదీ చదవండి: జీడిపిక్కల కర్మాగారం పునఃప్రారంభం...పనుల్లోకి కార్మికులు