ETV Bharat / state

విశాఖ మన్యంలో మావోయిస్టులు ఘాతుకం.. ఇద్దరు గిరిజనుల హత్య

విశాఖ మన్యంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులను హత్య చేశారు. మృతులు చింతపల్లి మండలం వీరవరం గ్రామస్థులైన రాజారావు, సత్తిబాబు.

mavo
author img

By

Published : Jul 18, 2019, 10:22 AM IST

Updated : Jul 18, 2019, 1:01 PM IST

విశాఖ మన్యంలో మావోయిస్టులు ఘాతుకం.. ఇద్దరు గిరిజనుల హత్య

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ.. ఇద్దరు గిరిజనులను హతమార్చడమే కాకుండా మరో గిరిజనుడిని తీవ్రంగా గాయపరిచారు.

స్థానికులు, కుటుంబీకుల వివరాల ప్రకారం...
ఏజెన్సీలో చింతపల్లి మండలం వీరవరం గ్రామంలో గురువారం తెల్లవారుజామున మారణాయుధాలతో కొంతమంది మావోయిస్టులు ప్రవేశించారు. ఇంట్లో నిద్రిస్తున్న పాంగి రాజారావు, ఎమ్మిలి సత్తిబాబు, లింగరాజులను ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చారు. పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ పాంగి రాజారావు, ఎమ్మిలి సత్తిబాబులపై కాల్పులు జరపడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరో గిరిజనుడు లింగరాజు తనను వదిలేయమని ప్రాధాయపడటంతో విచక్షణారహితంగా చితక్కొట్టారు. పద్ధతి మార్చుకోకపోతే వీరిద్దరికీ పట్టిన గతే నీకూ పడుతుందని హెచ్చరించి విడిచిపెట్టారు.

Intro:222

Body:888

Conclusion:పాలకుల శ్రద్ధ ,అధికారుల నిర్లక్ష్యం విద్యార్ధుల పాలిట శాపంగా మారింది ప్రభుత్వపాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కడప జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదుల కొరత వేధిస్తోంది.

ఇది కడప జిల్లా లోని బద్వేలు బాలుర ఉన్నత పాఠశాల 11- 6- 2018 లో దీన్ని స్థాపించారు. మొదట మిడిల్ స్కూల్ గా ఉన్న ఈ పాఠశాల అంచెలంచెలుగా ఎదిగి జిల్లా పరిషత్ ఉన్నత స్థాయికి ఎదిగింది. తరగతి గదులు నిర్మించి అరవై ఏళ్లు పైబడడంతో శిథిలావస్థకు చేరాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మబడి తదితర పథకాల వల్ల ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ పాఠశాలలో పదిహేను వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలోనే విద్యార్థుల సంఖ్యలో మొదటి స్థానంలో నిలిచింది .ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ పాఠశాలకు తరగతి గదుల కొరత వల్ల చదువులు సక్రమంగా చెప్పలేకపోతున్నామని ఉపాధ్యాయులు బాధపడుతున్నారు. తరగతి గదుల్లో లో సాధారణంగా 40 మంది విద్యార్థులు ఉండాలి అటువంటిది తరగతి గదులు లేక రెట్టింపు స్థాయిలో విద్యార్థులను కూర్చోబెట్టి చేయాల్సి బోధన చేయాల్సి వస్తోంది.

బైట్స్
పుల్లయ్య ప్రధానోపాధ్యాయులు బద్వేలు

కడప జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 3,225 పాఠశాలలు ఉన్నాయి. లక్షా 75 వేల మంది పైచిలుకు విద్యార్థినీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Last Updated : Jul 18, 2019, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.