ETV Bharat / state

Maoist: మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్షలు పూర్తి

విశాఖ మన్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్షల ప్రక్రియ పూర్తైంది. నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పలు మృతదేహాలను ఆయా కుటుంబీకులకు అప్పగించారు.

Maoists diabodies posmatram completed
మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్షలు పూర్తి
author img

By

Published : Jun 19, 2021, 9:50 AM IST

విశాఖ మన్యం తీగలమెట్ట ఎదురుకాల్పుల్లో మరణించిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తైంది. వీరిలో ముగ్గురు మృతదేహాలను ఇప్పటికే వారి స్వస్థలాలకు తరలించారు. కాల్పుల్లో మృతి చెందిన తెలంగాణ పెద్దపల్లి జిల్లా గుంపుల గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడు అశోక్ అలియాస్‌ గంగయ్య కుటుంబీకులు శుక్రవారం మృతదేహాన్ని తీసుకెళ్లారు.

ఒడిశా మల్కాన్‌గిరికి చెందిన మరో మృతుడు రణదేవ్ అలియాస్ ముఖేష్ మృతదేహాన్ని అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. మరో మహిళా మావోయిస్టు లలిత మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆమె బంధువులు వచ్చారు. మిగిలిన ముగ్గురు మృతదేహాలను నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి వద్ద శీతల పెట్టెలలో భద్రపరిచి పోలీసులు భద్రత నడుమ ఉంచారు. మీరు బంధువులు రాకపోతే నర్సీపట్నంలో వీరి అంత్యక్రియలు ముగించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మావోయిస్టుల మృతదేహాలకు కొనసాగుతున్న పోస్టుమార్టం ప్రక్రియ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.