విశాఖ ఉక్కు ఉద్యమానికి, రేపు జరగనున్న భారత్ బంద్కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు సీపీఐ మావోయిస్టు పార్టీ ఆంధ్ర - ఒడిశా ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ ఆడియో టేపులో తెలిపారు. అన్నివర్గాల ప్రజలూ స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.
కార్మికులు, రైతులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని గణేష్ వెల్లడించారు. దోపిడీలకు పాల్పడుతున్న పాలకవర్గాలు.. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమంటూ చేస్తున్న ప్రకటనలను నమ్మవద్దని సూచించారు. ప్రజలను మభ్యపెట్టడానికే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: