విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రిలోని సీఎస్ఆర్ బ్లాక్‌లోని కొవిడ్ వార్డులో చోరీ చోటు చేసుకుంది. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి నుంచి బంగారు ఆభరణాలు అదృశ్యమవుతున్నాయని మృతుల కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యాయం చేయండి..
ఈ విషయమై సిబ్బందిని బాధితల బంధువులు నిలదీశారు. విధుల్లో ఉన్న పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలకు సంబంధించి చేతి వాటం ప్రదర్శిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టు బట్టారు.
ఇవీ చూడండి :