ETV Bharat / state

నాడు-నేడు పనుల్లో అవకతవకలు... నలుగురి సస్పెండ్ - visakha district Latest news

విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలోని పాఠశాలల్లో నిర్వహించిన నాడు - నేడు పనుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించి... నలుగురు ప్రధానోపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. నాడు - నేడు పనుల్లో పర్యవేక్షణ లోపం, నాసిరకం పనులపై ఇటీవల జరిగిన డీఆర్​సీ సమావేశంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రస్తావించారు. దీనిపై విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Manipulations in Nadu-Nedu works ... Four suspended
నాడు-నేడు పనుల్లో అవకతవకలు... నలుగురు సస్పెండ్
author img

By

Published : Dec 2, 2020, 10:25 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని కుండ్రం, కొప్పాక, మామిడిపాలెం, కశింకోట మండలం తాళ్లపాలెం పాఠశాలల్లో... నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా జరిగిన పనులను ఆర్జేడీ నాగేశ్వరరావు పరిశీలించారు. పనులు నాసిరకంగా జరిగినట్లు గుర్తించి... మామిడిపాలెం ప్రధానోపాధ్యాయులు వి.దాసు, కొప్పాక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.శివనాయుడు, తాళ్లపాలెం ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, కుండ్రమ్ ప్రధానోపాధ్యాయులు సుబ్బారావులను సస్పెండ్ చేస్తూ... ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంజినీరింగ్ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉండగా... వారిపై చర్యలు తీసుకోకుండా ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని.. జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి వద్ద పలువురు ఉపాధ్యాయులు వాపోయారు.

ఇదీ చదవండీ...

కొత్తూరు సమీపంలో ప్రమాదం... కండక్టర్ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.