ETV Bharat / state

అనకాపల్లిలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

author img

By

Published : May 24, 2021, 9:46 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపార్ట్​మెంట్​లో వాచ్​మన్​గా పనిచేస్తున్న అప్పలరాజు.. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

Man commits suicide by hanging in Anakapalle
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

అపార్ట్​మెంట్​లో వాచ్​మన్​గా పనిచేస్తున్న అప్పలరాజు అనే వ్యక్తి.. ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని అపార్ట్​మెంట్​లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యానికి బానిసైన అప్పలరాజు తరచూ భార్యతో గొడవ పడి.. చనిపోతానని బెదిరించే వాడు. శనివారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్య లక్ష్మితో గొడవ పడ్డాడు.

అనంతరం ఇంట్లోకి వెళ్లి తలుపు మూసేసి ఉరి వేసుకున్నాడు. ఎంతకీ తీయకపోవటంతో అపార్ట్​మెంట్ వాసులు తలుపు పగలగొట్టారు. అప్పలరాజును ఆసుపత్రికి తరలించగా.. వైద్యుడు పరిశీలించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడు పిన్ని నాగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ధనుంజయ్ తెలిపారు.

ఇవీ చూడండి:

రసాయనం లీకేజీతో ఆందోళన...సిబ్బంది అప్రమత్తతో తప్పిన ముప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.