విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న గోశాలను భాజపా ఎమ్మెల్సీ మాధవ్ సందర్శించారు. రెండు రోజులుగా అప్పన్న ఒప్పంద ఉద్యోగులను తొలగించడం, స్వామివారి గోశాలలో రెండు కోడె దూడలు మరణించడంపై వరుసగా మీడియాలో కథనాలు రావడంతో స్వయంగా తెలుసుకోవాలని పర్యటించారు. అర్హులైన గోసంరక్షకులను నియమించాలని మాధవ్ డిమాండ్ చేశారు. గోవులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. గోసంరక్షణకు శాశ్వత ఉద్యోగులను నియమించాలని సూచించారు.
ఇదీ చదవండి: కేబినెట్ భేటీ: కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ