ETV Bharat / state

చదువుల బడికి స్వర్ణోత్సవాలు - చదువుల బడికి స్వర్ణోత్సవాలు

ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్న మాచ్​ఖంచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు ఈ నెల 11, 12 తేదీల్లో స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నారు.

చదువుల బడికి స్వర్ణోత్సవాలు
author img

By

Published : May 3, 2019, 5:46 PM IST

Updated : May 3, 2019, 11:38 PM IST

చదువుల బడికి స్వర్ణోత్సవాలు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న మాచ్​ఖంచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. అత్యంత మారుమూల ప్రాంతంలో ఉన్న పాఠశాలలో ఓనమాలు నుంచి ఉన్నత విద్య వరకు చదువుకున్న వారంతా వివిధ చోట్ల స్థిరపడ్డారు. స్వర్ణోత్సవాలు సందర్భంగా... పూర్వ విద్యార్థులందరూ ఏకమై ఈ నెల 11,12 తేదీలలో ఉత్సవాలు జరపడానికి రంగం సిద్ధం చేశారు. 1968లో ఇక్కడ పాఠశాలను స్థాపించారు. ఇప్పటివరకు దాదాపు ఐదు వేల మందికి పైగా విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించారు. ఈ పాఠశాలలో చదువుకున్న వారిలో కలెక్టర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు, తహసీల్దార్​లుగా స్థిరపడ్డారు. ప్రస్తుతం పూర్వ విద్యార్థుల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలకు రంగు రంగుల చిత్రాలు వేస్తూ తమ చదువుల బడికి ముస్తాబు చేస్తున్నారు. బాల్యం నాటి తీపి జ్ఞాపకాలను పాత మిత్రులతో మరో మారు పంచుకోవడానికి అందరూ స్వర్ణత్సవాల గురుంచి ఎదురు చూస్తున్నారు.

ఇవి చూడండి...సాహసాల బామ్మ.. విన్యాసాలు చూద్దామా!

Intro:సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 6వ తేదీన జరగనున్న రీపోలింగ్ నియమ నిబంధనలను పలు పార్టీల నాయకులకు జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా వివరించారు. నరసరావుపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మండలంలోని 94వ పోలింగ్ కేంద్రమైన కేసానుపల్లి గ్రామంలో మే 6న నిర్వహించే రీపోలింగ్ లో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని పోలింగ్ జరిపేలా సిద్ధం చేశామని తెలిపారు.

Body:జరిగిన ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో 239 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరిగేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నామో అటువంటి చర్యలనే ఇప్పుడు నిర్వహించే రీపోలింగ్ కు తీసుకుంటున్నామని అన్నారు. అదే విధంగా కేసానుపల్లిలో మొత్తం 956 మంది ఓటర్లు ఉన్నారన్నారు. వారిలో పురుషులు 466 మంది ఉండగా మహిళలు 490 మంది ఉన్నారని తెలిపారు. అయితే పోలింగ్ కేంద్రం వద్ద ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. రాజకీయ నాయకులకు నోటీసులు, ఓటర్లకు స్లిప్పులు, రీపోలింగ్ రోజు ఓటర్లకు అవసరమైన వసతులు, ఏర్పాట్లు చేశామని అన్నారు.

Conclusion:ఫ్లయింగ్ స్క్వాద్, హెడిమీటర్స్ సెక్కురల్ అధికారులకు అవగాహన కల్పించామని అన్నారు. జరగనున్న రీపోలింగ్ కు ఏ పార్టీ నాయకుడు ప్రచారాలు చేయకూడదని ఆయా పార్టీ ల నాయకులకు సూచించారు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ విషయాన్ని పోలీస్ శాఖతో ముందుగానే మాట్లాడామన్నారు. రీపోలింగ్ నిర్వహించే కేసానుపల్లి లో గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే శుక్రవారం సాయంత్రం వరకు అక్కడినుంచి వారి ప్రాంతాలకు తక్షణం వెళ్లిపోవాలని మీడియా ద్వారా ఆయన కోరారు. అదే విధంగా పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు సంబంధం ఉన్న వ్యక్తులకు తప్ప మరొకరికి అనుమతి లేదన్నారు. మే 6వ తేదీ ఉదయం 07 గంటల నుండి సాయంత్రం 06 గంటల వరకు ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవచ్చని జేసీ హిమాన్షు శుక్లా తెలిపారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052,
8500512909.
Last Updated : May 3, 2019, 11:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.