ETV Bharat / state

Luxury Buildings in Visakhapatnam for CM Jagan: జనం సొమ్ముతో.. సీఎం జగన్ సోకులు!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2023, 10:43 AM IST

Luxury Buildings in Visakhapatnam for CM Jagan: అమరావతిలో గత ప్రభుత్వం సచివాలయం నిర్మిస్తే భారీగా ఖర్చు చేశారంటూ అప్పుట్లో వైఎస్సార్సీపీ దుష్ప్రచారానికి దిగింది. ఖర్చుల వివరాలను నాటి తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించినా వైఎస్సార్సీపీ పట్టించుకోలేదు. నానాయాగీ చేసింది. ఇప్పుడదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రుషికొండపై సీఎం నివాసం, కార్యాలయాల కోసమేనని ఆరోపణలు వినిపిస్తున్న చోట రిసార్ట్‌ పేరుతో అత్యంత విలాసవంతమైన భవనాలు నిర్మిస్తోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Luxury Buildings in Visakhapatnam for CM Jagan
Luxury Buildings in Visakhapatnam for CM Jagan

Luxury Buildings in Visakhapatnam for CM Jagan: జనం సొమ్ముతో.. సీఎం జగన్ సోకులు!

Luxury Buildings in Visakhapatnam for CM Jagan : విశాఖలోని రుషికొండపై రిసార్ట్‌ పేరుతో ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాలకు పెడుతున్న ఖర్చెంతో తెలుసా? చదరపు అడుగుకు సుమారు 24 వేల 22 రూపాయలు. రుషికొండపై వేంగి, కళింగ, గజపతి, విజయగర బ్లాక్‌ల పేరుతో లక్షా 45 వేల 765 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన భవనాల నిర్మాణానికి చేస్తున్న వ్యయం 350కోట్ల 16 లక్షలు. రిసార్ట్‌ నిర్మిస్తున్నామని ప్రభుత్వం మభ్యపెడుతున్నా కడుతోంది సీఎం క్యాంపు కార్యాలయమేనని లోకం కోడై కూస్తోంది.

YSRCP Government Wasting Public Money in AP : గత ప్రభుత్వం అమరావతిలో 6 లక్షల చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియాతో నిర్మించిన సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణానికైన ఖర్చు కేవలం 526 కోట్ల 57 లక్షల రూపాయలే. ప్రభుత్వ లెక్కల ప్రకారం వాటి నిర్మాణానికి, బాహ్య, అంతర్గత పనులన్నీ కలిపి చదరపు అడుగుకు చేసిన వ్యయం 6 వేల 70 రూపాయలు మాత్రమే. గత ప్రభుత్వం అమరావతిలో యుద్ధప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టి ఏడు నెలల్లోనే పూర్తి చేస్తే.. అప్పటి ప్రతిపక్ష వైసీపీ నాయకులు రోజుకో ఆరోపణ తెరపైకి తెచ్చారు. గత ప్రభుత్వం దానికి "ఇంటెరిమ్‌ గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ (Interim Government Complex)" అని పేరు పెట్టినందుకు.. వైసీపీ నేతలు అవి తాత్కాలిక భవనాలనేంటూ ముద్ర వేశారు. వాటికి 12 వందల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టారని దుష్ప్రచారం చేశారు.

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తోందేంటి? రుషికొండపై కడుతోంది రిసార్టయినా, సీఎం క్యాంప్‌ ఆఫీసయినా.. ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చుపెట్టే అధికారం ఎవరిచ్చారు? అది సీఎం క్యాంపు కార్యాలయమే అయితే ముఖ్యమంత్రి ఉండటానికి ప్రజల డబ్బుతో అంత విలాసవంతమైన భవనాలు నిర్మించడమేంటి? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాచరిక పాలనలో ఉన్నామా? సుమారు పది లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో అంత విలాసవంతమైన భవనాల్ని నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? నిర్మాణాలను చూసేందుకు ఎవర్నీ వెళ్లనివ్వనంత రహస్యం ఎందుకు అని ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

YSRCP Government Wasting Public Money: ప్రభుత్వ నిర్వాకం.. ప్రణాళికా లోపంతో రూ. 557 కోట్ల ప్రజాధనం 'పునాదుల' పాలు

అమరావతిలో తాత్కాలిక సచివాలయం (Temporary Secretariat at Amaravati) అంటూనే వందల కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు ప్రభుత్వం దుబారా చేసిందని.. 220 కోట్ల అంచనాలతో మొదలుపెట్టి ఇప్పటికి 12 వందల కోట్లు ఖర్చు పెట్టిందంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. అయితే అమరావతి సచివాలయ నిర్మాణానికి గత ప్రభుత్వం చేసిన ఖర్చుపై అప్పట్లో వైసీపీ నాయకులు చేసింది ముమ్మాటికీ అసత్య ప్రచారమేనని, ఇప్పుడు రిసార్ట్‌ పేరుతో రుషికొండపై చేస్తున్న వృథా ఖర్చు ముమ్మాటికీ వాస్తవమేనని వైసీపీ ప్రభుత్వ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిపై శాసనసభలో చర్చించేందుకు సీఆర్‌డీఏ (Capital Region Development Authority) తయారు చేసిన నోట్‌లో అమరావతిలో 6 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణానికి 526 కోట్ల 57 లక్షల వ్యయమైందని పేర్కొంది. భవనాల నిర్మాణానికైతే చదరపు అడుగుకు 2 వేల 312.50, బాహ్య, అంతర్గత వసతులు కూడా కలిపితే 6 వేల70 రూపాయలు ఖర్చయినట్టు పేర్కొంది. పోనీ 526 కోట్ల 57 లక్షలను 6 లక్షలతో భాగించినా ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికైన ఖర్చు 8 వేల 776 రూపాయల మాత్రమే.

అమరావతిలో సచివాలయం, శాసనసభ కోసం గత ప్రభుత్వం ఒక్కొక్కటి లక్ష చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం గల ఆరు భవనాల్ని పైల్‌ ఫౌండేషన్‌తో అత్యంత పటిష్ఠంగా నిర్మించింది. నేల లోపల రాయి తగిలే వరకు యంత్రాలతో తవ్వుతూ వెళ్లి.. అక్కడి నుంచి ఉక్కు, ఇనుముతో బలమైన స్తంభాలు నిర్మించడాన్నే పైల్‌ ఫౌండేషన్‌ అంటారు. అప్పటికి రెండు అంతస్తుల చొప్పునే కట్టినా, భవిష్యత్తులో మరో 5 అంతస్తులు వేసుకునేలా 1000 నుంచి 1200 పైల్స్‌ వేసి పునాదుల్ని బలంగా నిర్మించింది. అందువల్లే అప్పట్లో పునాదుల నిర్మాణానికి ఎక్కువ ఖర్చయింది.

Construction of Wall Around Rushikonda : నిబంధనలు ఉల్లంఘిస్తూ.. రుషికొండ చుట్టూ ప్రహరీ నిర్మాణం..

సచివాలయం నిర్మాణానికి 30 నుంచి సుమారు 70 అడుగుల లోతు వరకు పైల్స్‌ నిర్మించారు. ఎన్ని దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరని విధంగా పునాదుల నిర్మాణం చేపట్టారు. ఐకానిక్‌ భవనాలు నిర్మించే వరకు అక్కడ సచివాలయం, శాసనసభలు నిర్వహించే ఉద్దేశంతో గత ప్రభుత్వం దానికి "ఇంటెరిమ్‌ గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ (Interim Government Complex)" అని పేరు పెట్టింది. అవి పటిష్ఠ భవనాలని తెలిసినప్పటికీ వైసీపీ నాయకులు వాటికి తాత్కాలిక భవనాలని ముద్ర వేసి, దుష్ప్రచారం చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా పాలన సాగిస్తున్నది.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నదీ ఆ భవనాల్లోనే.

అమరావతిలో గత ప్రభుత్వం కట్టింది సచివాలయం, శాసనసభ భవనాలు. ఉద్యోగులు సౌకర్యంగా పని చేసుకునేందుకు కార్పొరేట్‌ కార్యాలయాల్ని తలదన్నేలా సెంట్రలైజ్డ్‌ ఏసీ వంటి వసతులు, క్యూబికల్స్‌ ఏర్పాటుతో వాటిని నిర్మించింది. వాటిలో ఐఏఎస్‌లతోపాటు, వివిధ స్థాయిల అధికారులు, ఉద్యోగులు రెండు మూడు వేల మంది పనిచేస్తున్నారు. కానీ రుషికొండలో నిర్మిస్తోంది కేవలం సీఎం నివాసం (CM Residence is Being Built in Rushikonda), ఆయన కార్యాలయం మాత్రమే! అమరావతి సచివాలయంతో పోలిస్తే.. రుషికొండలో సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం ఒక్కో చదరపు అడుగుకు మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతోంది.

అప్పటికీ ఇప్పటికీ నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయనుకున్నా.. మరీ అంత దుబారానా? రుషికొండ భవనాల్లో ఒక్కో చదరపు అడుగుకు అసాధారణ రీతిలో 24 వేల 22 రూపాయల చొప్పున ఎందుకు ఖర్చవుతోంది? భవనం గోడలకు ఏమైనా బంగారు పూత వేస్తున్నారా? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా.. ఒక్కో మరుగుదొడ్డి కమోడ్‌కు 25 లక్షల రూపాయలు చొప్పున ఖర్చుపెడుతున్నారా?

YSRCP Deleted Rushikonda Constrcutions Tweet: అంతా తూచ్​.. రుషికొండపై నిర్మిస్తోంది సచివాలయం కాదు..! వైసీపీ మరో ట్విట్​..

రుషికొండపై జగన్‌ సచివాలయం కడుతున్నారంటూ వైసీపీ కొన్ని రోజుల క్రితం అధికారిక ట్విటర్‌ ఖాతాలోనే పేర్కొంది. అంతలోనే నాలుక్కరుచుకుని దాన్ని తొలగించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ అక్కడ కడుతోంది రిసార్టేనని నమ్మించేందుకు ప్రయత్నిస్తోంది. పోనీ అది పర్యాటకశాఖ కడుతున్న రిసార్టే అనుకున్నా అంత భారీ మొత్తం వెచ్చించి కడుతున్నారంటే ఎవరైనా నమ్ముతారా? ప్రభుత్వ రంగంలో అంత భారీ వ్యయంతో ప్రాజెక్టులు కట్టడం ఎప్పుడైనా చూశామా?

పర్యాటకశాఖకు నిజంగానే హోటళ్లు, రిసార్టుల్ని అభివృద్ధి చేయాలని ఆలోచన వచ్చిందనుకున్నా కేవలం రుషికొండ ప్రాజెక్టుపైనే (Rushikonda Project)అంత శ్రద్ధ ఎందుకు? రాష్ట్రంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని మిగతా హోటళ్లు, రిసార్టుల్లో కనీస వసతులు లేక పర్యాటకులు రాకపోవడంతో ఈగలు తోలుకుంటున్నారు కదా! వాటిపై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, మొత్త డబ్బంతా రుషికొండపైనే ఎందుకు కుమ్మరిస్తున్నారు? దాన్నేమైనా హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌ను తలదన్నేలా తీర్చిదిద్దాలని పర్యాటకశాఖ కంకణం కట్టుకుందా?

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో రెండు, మూడు వైద్య కళాశాలల భవనాలు తప్ప.. ప్రజలకు ఉపయోగపడే చెప్పుకోదగ్గ ఒక్క భారీ నిర్మాణమూ చేపట్టలేదు. ఈ ప్రభుత్వం అత్యంత శ్రద్ధతో, వందల కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తున్న ప్రాజెక్టు ఏదైనా ఉందంటే.. అవి రుషికొండపై నిర్మాణాలు మాత్రమే. ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదంగా, నిబంధనల్ని యథేచ్ఛగా ఉల్లంఘించి చేపట్టిన, అనేక కేసుల్ని ఎదుర్కొన్న ప్రాజెక్టు కూడా రుషికొండ ప్రాజెక్టే! ఎన్ని విమర్శలొచ్చినా లెక్క చేయకుండా, సీఆర్‌జెడ్, పర్యావరణ నిబంధనల్ని అతిక్రమించి మరీ ప్రభుత్వం దీన్ని చేపట్టింది. రుషికొండను ఇష్టానుసారం తవ్వేసి గుండు కొట్టేసింది మొదలు మట్టిని తరలించడం, ప్లాన్లకు అనుమతులు తీసుకోవడం, అనుమతించిన పరిధిని దాటి ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టడం వరకు ప్రతి దశలోనూ ఆ ప్రాజెక్టు అత్యంత వివాదాస్పదమైంది.

రుషికొండపై 2.14 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన ఏడు బ్లాక్‌ల నిర్మాణానికి పర్యాటక శాఖ అనుమతులు తీసుకుంది. తొలి దశలో నాలుగు బ్లాక్‌లు మాత్రమే నిర్మిస్తోంది. అప్పటికే అక్కడున్న పర్యాటకశాఖ రిసార్టు భవనాల్ని తొలగించేందుకు, మట్టి, రాయి తవ్వేందుకు, రిటెయినింగ్‌వాల్‌ నిర్మాణం, రహదారులు, స్లోప్‌ ప్రొటెక్షన్‌ వర్క్‌ వంటి పనులన్నింటికీ 92 కోట్ల రూపాయలు, ఈ నాలుగు భవనాల నిర్మాణానికి 72 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 164 కోట్లు రూపాయలు ఖర్చవుతుందని తొలుత అంచనా వేశారు. కానీ భవనాల్ని అత్యంత విలాసంగా తీర్చిదిద్దే క్రమంలో అంచనాలు విపరీతంగా పెంచేశారు. 164 కోట్లు అనుకున్న ఖర్చు ప్రభుత్వ లెక్కల ప్రకారం 350 కోట్ల 16 లక్షలకు పెరిగింది. అది అక్కడితో ఆగుతుందా, ఇంకా పెరుగుతుందా అన్నది చూడాలి.

Writ Petition in Supreme Court on Rushikonda: రుషికొండలో సీఎం క్యాంప్ కార్యాలయం పేరిట.. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.