విశాఖ జిల్లా తగరపువలస జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి లారీ అదుపు తప్పి కిందకు పడింది. ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ఇసుకను అన్లోడ్ చేసే సమయంలో బ్రిడ్జి పైనుంచి కిందకు ఒరిగింది. వెనుక భాగం కిందనున్న రహదారిని ఆనుకొని నిటారుగా నిలిచిపోయింది. లారీ అదుపు తప్పిన సమయంలో అటుగా వాహనాలు రాకపోవటంతో ప్రమాదం తప్పింది. లారీ అడ్డుగా ఉండి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో.. పోలీసులు రద్దీని నియంత్రించారు.
ఇదీ చూడండి. రాష్ట్రంలో అన్ లాక్ 2.0 నిబంధనలివే