విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో లాక్డౌన్ అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఆదివారం జనతా కర్ఫ్యూతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. సోమవారం యథావిధిగా రోడ్లపైకి వచ్చారు. దుకాణాలు, హోటళ్లు తెరచుకున్నాయి. ఆటోడ్రైవర్లు ఆటోలు నడిపారు. జాతీయ రహదారిపై వాహనాలు తిరిగాయి. విషయం తెలుసుకున్న పాయకరావుపేట పోలీసులు.. షాపులు మూసేయాలని నిర్వాహకులకు ఆదేశించారు.
ఇదీ చదవండి: