కేంద్ర బలగాలతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. సర్పంచ్ ఎన్నికలపై సుప్రీం కోర్టులో తీర్పు వెలువడటంతో విశాఖ జిల్లా అనకాపల్లి తెదేపా కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించటం తథ్యమని పేర్కొన్నారు. పార్టీ అభ్యుర్థుల విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: