నాలుగేళ్ల క్రితం ఏజెన్సీలో ఈ లిక్విడ్ గంజాయిని తయారు చేశారు. 2017 ఫిబ్రవరిలో జి.మాడుగుల మండలం అలగం గ్రామంలో 50 కిలోల లిక్విడ్ గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. తరువాత ఎక్కడా లిక్విడ్ గంజాయి పట్టుబడ్డ దాఖలాలు లేవు. తాజాగా చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ బొడ్డపుట్టు అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు 41 కిలోల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
లిక్విడ్ గంజాయి ఎలా తయారు చేస్తారు..?
లిక్విడ్ గంజాయి తయారీకి స్మగ్లర్లు ప్రత్యేకంగా యంత్రాలను వాడుతున్నారు. పచ్చి గంజాయి ఆకులు, పూలను ఈ మిషనరీలో ప్రాసెసింగ్ చేసి, దీనికి పెట్రోలియం ఎథర్ అనే రసాయనం కలుపుతారు. అనంతరం కుక్కర్‌లో 30 నుంచి 45 నిమిషాలు పాటు ఉడికిస్తారు. చివరిగా మిగిలిన నల్లటి ముద్దను కిలో, అర కిలోలుగా ప్యాకింగ్ చేసి రవాణా చేస్తున్నారు. 25 కిలోల పచ్చి గంజాయి ఆకులు, పూలను ప్రాసెసింగ్ చేస్తే కిలో లిక్విడ్ గంజాయి వస్తుంది. ఎండు గంజాయితో పోలిస్తే దీని ధర 20 రెట్లు అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
స్మగ్లర్లు లిక్విడ్ గంజాయితో చాక్లెట్లు, బిస్కెట్లు తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. అదే విధంగా లిక్విడ్ గంజాయిని సిగరెట్ల రూపంలోనూ తయారు విక్రయిస్తున్నారని గుర్తించారు.
ఇవీ చూడండి: