LIPI DOT GAME: సాంకేతికతను ఉపయోగించి.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు టెక్నో క్రాట్ ముందుకు వస్తున్నారు. విశాఖ నుంచి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిన సాగర్ అనిసింగరాజు.. దీని కోసం ప్రత్యేకంగా.. "లిపి డాట్ గేమ్" అన్న దాన్ని రూపొందించి.. అంతర్జాలంలో వాడకం కోసం ట్రయల్స్ పూర్తి చేశారు. ఇటీవలే విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా దీనిని ఆవిష్కరించారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలైన మొబైల్, టాబ్, లాప్‌టాప్, డెస్క్‌టాప్ వంటి వాటిపై ఆడుకునేందుకు వీలుగా దీనిని రూపొందించినట్లు.. సాగర్ వివరించారు. దీనిని ఆడటం వల్ల మనోఉల్లాసంతో పాటు భాషపై పట్టు, జ్ఞాపకశక్తి పెరుగుతాయని చెప్పారు.
"దీనిని ఆడటం ద్వారా పిల్లలకే కాదు పెద్దలకు కూడా మనోవిల్లాసంతో పాటు భాష మీద పట్టు పెరుగుతుంది. ప్రతిరోజూ 15నిమిషాలు ఆడటం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మాతృభాషలో ఆడటం ద్వారా బ్రెయిన్‌కి ఎక్సర్సైజ్ అవుతుంది. లిపి గేమ్‌లో ప్రతిరోజూ ఓ తెలుగు పదం గోప్యంగా ఉంటుంది. ఏడు క్లూస్లతో ఆ పదాన్ని వెతకాలి. అది కరెక్టా లేదా అనేది డిక్షనరీలోకి వెళ్లి వెతకాలి. కాలిఫోర్నియాలో యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర ద్వారా కోటి మాటల కోట అని ఒక ప్రాజెక్టు చేశాం. ప్రపంచంలో ఇప్పటిదాకా ఉన్నా పాత, కొత్త తెలుగు పదాలు అన్ని అందులో ఉంటాయి"-సాగర్ అనిసింగరాజు, లిపి డాట్ గేమ్ రూపకర్త
ఇవీ చదవండి: