ETV Bharat / state

ఎల్​జీ పాలీమర్స్ గ్యాస్ లీకేజీ బాధిత గ్రామస్థుల ఆందోళన - gas leak villagers agitaton

నెలలు గడుస్తున్నా తమకు పరిహారం అందలేదని ఎల్​జీ పాలీమర్స్ గ్యాస్ లీకేజీ బాధిత గ్రామమైన కృష్ణానగర్ వాసులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేను కలిసినా తమకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని వాపోయారు.

lg polymers gas leak victim villagers agitation
ఎల్​జీ పాలీమర్స్ గ్యాస్ లీకేజీ బాధిత గ్రామస్థుల ఆందోళన
author img

By

Published : Jul 17, 2020, 10:41 PM IST

ఎల్​జీ పాలీమర్స్ బాధిత గ్రామాల్లో తమ గ్రామాన్ని చేర్చినా... తమకు ఎటువంటి పరిహారం అందలేదని విశాఖ జిల్లా కృష్ణానగర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దుర్ఘటన జరిగి రెండు నెలలు గడుస్తున్నా తమకు న్యాయం చేయలేదని వాపోయారు. గ్యాస్ లీకేజీ బాధిత గ్రామంగా గుర్తించి... పరిహారం మంజూరు చేసినా... తమకు ఇప్పటి వరకు ఎటువంటి సాయం అందలేదని వాపోయారు.

గ్రామ వాలంటీర్ వచ్చి సర్వే చేసి.. పేర్లు నమోదు చేసుకున్నా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్​రాజ్​ను కలిసినా... స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నారు. అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేడంటూ వాపోయారు.

ఇదీ చదవండి: అనారోగ్యంగా ఉన్న ఆవులను స్వీకరించొద్దు: మంత్రి అవంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.