ETV Bharat / state

'కేంద్రం తీరును ప్రజలకు వివరిస్తాం.. బీఎస్​ఎన్​ఎల్​ను కాపాడుకుంటాం' - బీఎస్ఎన్ఎల్ సంస్థ

బీఎస్ఎన్ఎల్​ పట్ల కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖపట్నం డాబా గార్డెన్స్​లోని సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. అక్టోబర్ మాసమంతా నిరాహార దీక్షలు చేపట్టి ప్రజలకు కేంద్రం దోపిడీపై విస్త్రృత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

'కేంద్రం పోకడను ప్రజలకు వివరించి బీఎస్​ఎన్​ఎల్ కాపాడుకుంటాం'

author img

By

Published : Oct 1, 2020, 7:53 PM IST

బీఎస్ఎన్ఎల్​లోనూ 4జీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఉద్యోగులు విశాఖలో నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వ హయాంలో నడుస్తున్న సంస్థకు 4జీ సేవలు ఇవ్వకుండా.. కుట్ర పూరితంగా ప్రైవేట్ రంగంలోని జియో, ఎయిర్​టెల్, ఐడియా వంటి సంస్థలకు 4జీ, 5జీ సేవలు కట్టబెట్టడంపై ఉద్యోగులు మండిపడ్డారు.

కేంద్రం కుట్ర..

కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ డాబా గార్డెన్స్​లోని ప్రాంతీయ కార్యాలయంలో భౌతిక దూరం పాటిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు ధర్నా చేపట్టారు. బీఎస్ఎన్ఎల్ సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఉద్యోగులు ధ్వజమెత్తారు.

అక్టోబర్ మాసమంతా ధర్నాలు..

ప్రభుత్వ అనాలోచిత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సంస్థను నిలబెట్టుకునేందుకు అక్టోబర్ మాసమంతా నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి సీహెచ్ విద్యాసాగర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు విస్త్రృత అవగాహన కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

తెదేపా మహిళా కార్యవర్గం సభ్యులు వీరే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.