విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయంలో.. నీటి నిల్వలు అడుగంటాయి. జలాశయం ప్రధాన స్పిల్ వే గేట్ల వద్ద చుక్క నీరు లేదు. ప్రాజెక్టులో నీరు తగ్గిపోయిన కారణంగా.. మట్టిదిబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
జలాశయం ఆయకట్టు రైతులు సాగునీటిపై ఆందోళన చెందుతున్నారు. పూర్తి నీటిమట్టం 114 మీటర్లు కాగా.. ప్రస్తుతం 105 మీటర్లు మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 109 మీటర్లు ఉండేదని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: