ETV Bharat / state

రాష్ట్రానికి అన్యాయం చేసిన భాజపాకు వత్తాసు పలకడం దారుణం: ప్రత్యేకహోదా సాధన సమితి - visakha update news

Leaders of special status sadhana samiti: రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకుండా.. తీరని అన్యాయం చేసిన భాజపా ప్రభుత్వ పెద్ద ప్రధాని మోదీని.. ప్రశ్నించకపోగా.. ఆయన భారీ బహిరంగ సభకు జనాన్ని సమీకరించి.. వత్తాసు పలికిన వైకాపా ప్రభుత్వం.. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని.. ప్రత్యేకహోదా సాధన సమితి నాయకులు విమర్శించారు.

ప్రత్యేకహోదా సాధన సమితి నాయకులు
Leaders of special status sadhana samit
author img

By

Published : Nov 13, 2022, 6:03 PM IST

Leaders of special status sadhana samiti: ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేకహోదా ఇవ్వకుండా భాజపా తీరని అన్యాయం చేస్తోందని.. ప్రత్యేకహోదా సాధన సమితి నాయకులు విమర్శించారు. విభజన హామీలు అమలు చేయకుండా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రజలను.. మోదీ ప్రభుత్వం నట్టెట ముంచిందన్నారు. విభజన అనంతరం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు.

ఆంధ్రప్రదేశ్​ హక్కుల కోసం ఈనెల 26న చలో దిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సాధన సమితి నాయకులు ప్రకటించారు. ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా వామపక్షాలు, కార్మిక సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం, మహిళలనీ చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం దారుణమన్నారు. మోదీకి రాష్ట్రంలోని వైకాపా, తెలుగుదేశం, జనసేన పార్టీలు వత్తాసు పలకడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టడమేంటని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ భాజపా మిత్రపక్షం నుంచి బయటకొచ్చి.. రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలని కోరారు. విశాఖపట్నంలో మోదీ సభకు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముతోనే.. పెద్ద సంఖ్యలో బస్సులు పెట్టి.. భారీగా జనాన్ని సమీకరించడం.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనన్నారు. వైకాపా ప్రభుత్వం తమ సొంత పార్టీ సభలా.. మోదీ సభ నిర్వహించడం సిగ్గు చేటన్నారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం.. మోదీని ప్రశ్నించకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ప్రత్యేక హాదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కాంగ్రెస్, అమ్ ఆద్మీ, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.