'జర్నలిస్టుల చట్టాలు-ఆవశ్యకత' అంశంపై వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ఆధ్వర్యంలో విశాఖ ప్రెస్ క్లబ్ లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డి ధర్మారావు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో ఎక్కడా పాత్రికేయులను కార్మికులుగా పిలవడం అనే రివాజు లేదని తెలిపారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన శాసన నిర్మాణ శాఖ, న్యాయ శాఖ, పరిపాలన శాఖల పనితీరుపై 'వాచ్ డాగ్' లా పనిచేసే పత్రికా రంగాన్ని నిర్వీర్యం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. సదస్సులో ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి బాబి వర్థన్, విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్ రావు, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆసియా వర్సిటీల్లో ఏయూ, ఓయూ ర్యాంకులు తెలుసా?