విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని శ్రీరాంపురం గ్రామంలో ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవాలని గ్రామానికి చెందిన దళితులు డిమాండ్ చేశారు. కోట్లు విలువైన ఈ భూమిని ఓ వ్యక్తి తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయి౦చారని ఆరోపించారు. ఈ విషయమై తాము నిలదీయగా దాడులు చేయి౦చారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణ౦ ఆక్రమణలో భూమిని స్వాధీనం చేసుకుని పంచాయతీకి అప్పగించాలని కోరారు.
ఇదీ చదవండి: