ETV Bharat / state

విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌ భూసేకరణపై అధికారుల దృష్టి - విశాఖ తాజా వార్దలు

విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ నిర్మాణంలో భాగంగా సేకరించిన భూముల స్వాధీనంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ప్రక్రియలో మళ్లీ కదలిక వచ్చింది. ఇటీవల సమావేశం ఏర్పాటు చేసిన కలెక్టర్‌ త్వరగా భూములు సేకరించాలని ఆదేశించగా.. అధికారులు సిద్ధమయ్యారు.

విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ భూసేకరణ   భూముల స్వాధీనంపై అధికారుల దృష్టి

author img

By

Published : Oct 4, 2020, 6:41 PM IST

పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం పదేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం ప్రారంభించిన భూ సేకరణ ప్రక్రియ ఇప్పటి వరకు సాగుతునే ఉంది. రైతులకు చాలా మేర పరిహారం చెల్లింపు ప్రక్రియ తెదేపా హాయంలోనే జరిగింది. దీనిలో భాగంగా అంకుర ప్రాంతాన్ని(స్టార్టప్‌ ఏరియా) సిద్ధం చేశారు. తర్వాత కాలంలో కొంత స్తబ్దత నెలకొంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత తిరిగి దీనిపై మరింత దృష్టి సారించింది. ఈ క్రమంలో పరిహారం చెల్లించనంత మేర భూములను ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న ఆదేశాలు ఇచ్చింది.

రాజయ్యపేట, బోయపాడు, అమలాపురం, చందనాడ, బుచ్చిరాజుపేట, డీఎల్‌పురం తదితర గ్రామాల పరిధిలో సేకరణ చేపట్టగా, సుమారు 4200 ఎకరాలను గుర్తించారు. ఇందులో 2300 ఎకరాల వరకు జిరాయతీ కాగా, మిగిలిన దానిలో డీఫాం, ప్రభుత్వ బంజరు ఉంది. వీటిలో జిరాయతీకి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించగా, డీఫాం, బంజరు సాగులో ఉన్న రైతుల్లో అర్హులను గుర్తించి దాదాపుగా వీరికి పరిహారం ఇచ్చారు. దీనికితోడు పాటిమీద, మూలపర్ర తదితర ప్రాంతాల్లో సేకరించిన భూముల్లో ఉన్న పక్కా భవనాలు, షెడ్లు, ఇళ్లు, పంట, చెట్లకు ఇలాంటి వాటికి కొంత మేర పరిహారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మరికొందరికి చెల్లింపులు చేయాల్సి ఉంది.

స్వాధీనమే తరువాయి:

అంకుర ప్రాంతంగా గుర్తించిన 1120 ఎకరాలను ముందుగా స్వాధీనం చేసుకోడానికి అధికారులు యోచిస్తున్నారు. తక్షణమే ఆయా గ్రామాల్లోకి వెళ్లి కార్యాచరణ చేపట్టాలన్న కలెక్టర్‌ సూచనతో ఇప్పటికే అధికారులు అడుగులు వేశారు. స్టార్టప్‌ ఏరియా అభివృద్ధిలో భాగంగా పాటిమీద సమీపంలో భారీ విద్యుత్తు ఉప కేంద్రం ఏర్పాటుకు 10 ఎకరాల భూమిని కేటాయించారు. కొద్దిరోజులుగా ప్రత్యేక ఉప కలెక్టర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ, సర్వే అధికారులు, గ్రామస్థాయి ఉద్యోగులు ఆయా గ్రామాల్లో పరిశీలన చేస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత, కార్మికులు, కూలీలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి.

రైతుల నుంచి నిరసనలు

భూములు కోల్పోయిన రైతుల నుంచి నిరసనలు వస్తున్నాయి. చెట్లు, భవనాల పరిహారం విషయంలో అధికారులు న్యాయం చేయలేదని ఆరోపిస్తున్నారు. డీఎల్‌పురం ప్రాంతంలో 48 మంది రైతులు పరిహారం రాలేదంటూ పలుమార్లు అధికారులకు విన్నవించారు. భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి ప్యాకేజీ ఇవ్వాలన్న డిమాండ్‌ ఉంది. బాధితులు ఇప్పటికే పలుమార్లు వామపక్ష నాయకులతో కలిసి ఆందోళన చేపట్టడమే కాకుండా, అధికారులను కలిసి సమస్యను వివరించారు. పాటిమీద ప్రాంతంలో ఇళ్లకు సంబంధించి సరైన న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. ఇళ్లకు సంబంధించి ఒకరికి తక్కువగా, మరొకరికి ఎక్కువగా పరిహారం ఇచ్చారని ఇటీవల ఎస్డీసీని కలిసి ఆవేదన చెందారు. ఈ విషయంలో స్పష్టత వచ్చే వరకు ఉప కేంద్రం ప్రాంతంలో పనులు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేస్తున్నారు. అంకుర ప్రాంతంలో చెట్ల తొలగింపును ఇటీవల కొందరు రైతులు అడ్డుకోవడంతో పనులను ఆపేశారు.

అభ్యంతరాలున్న వాటికే చెల్లింపులు జరగలేదు

ప్రభుత్వం సేకరించిన భూమికి సంబంధించి దాదాపుగా చెల్లింపులు పూర్తి చేశాం. డీఫాం, ప్రభుత్వ భూముల ఆక్రమణల్లో ఉన్న మరో 160 ఎకరాలకు మాత్రమే చెల్లింపులు జరగలేదు. వీటిపై అభ్యంతరాలు ఉండటంతో పరిష్కారించిన తర్వాత ఇస్తాం. ఊరిని పూర్తిగా ఖాళీ చేయిస్తేనే ప్యాకేజీ అనేది ప్రభుత్వం ఇస్తుంది. రైతులకు సంబంధించిన సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. ప్రస్తుతం స్టార్టప్‌ ఏరియా భూమిని తీసుకుంటాం. దీని తర్వాత మిగిలింది తీసుకుంటాం. ఇదంతా త్వరలోనే పూర్తి చేస్తాం.

- అనిత, ఎస్డీసీ, ఏపీఐఐసీ

ఇదీ చదవండి:

మృత్యువును జయించి... వ్యాపారవేత్తగా రాణిస్తున్న విశాఖ మహిళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.