విశాఖ జిల్లాలో ప్రస్తుతం లంబసింగికి పర్యటకుల తాకిడి నిత్యం అధికంగా ఉంది. కొయ్యూరు మండలం డౌనూరు నుంచి లంబసింగి ఘాట్‌రోడ్డు మొదలువుతుంది. 16 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్లో 13 ప్రమాదకర మలుపులున్నాయి. వీటి వద్ద కొన్ని చోట్ల రక్షణగా నిర్మించిన ఇనుప రెయిలింగ్‌లు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల రక్షణ గోడలు శిథిలమయ్యాయి. గతంలో కురిసిన భారీ వర్షాలకు కొన్నిచోట్ల కొండచరియలు విరిగి రహదారిపై పడ్డాయి.
భారీ బండరాళ్లు కావటంతో వాటిని పక్కకు తొలగించకుండా అలానే వదిలేశారు. వాహన చోదకులకు రాత్రి సమయంలో కనిపించేలా బండరాయికి తెల్లసున్నం వేశారు. బండరాళ్లు ప్రయాణికులు, వాహన చోదకులకు మరింత ఇబ్బందిగా మారాయి. ఇకనైనా వీటిని తొలగించి ప్రమాదాలను నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: