విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయం పరిధిలోని ఎగువ సాగునీటి కాలువలో నాచు తుప్పలు పెరుకుపోయాయి. దీంతో ఆయకట్టులో పొలాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనితో స్పందించిన మంచాల వైకాపా నాయకుడు పాటూరి రమణ ఆధ్వర్యంలో వంద మంది రైతులు ఎగువ సాగునీటి కాలువలో 2 కిలోమీటర్ల మేరకు నాచు తుప్పలను పూర్తిగా తొలగించారు. రైతుల శ్రమదానంతో పొలాలకు సాగునీరు పుష్కలంగా పారుతోంది. ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో వైకాపా మండల అధ్యక్షుడు అప్పారావు, దేముడు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: