ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో జోలాపుట్ వంతెన నిర్మాణం చాలా అవసరమని కోరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలక అన్నారు. శనివారం జోలాపుట్ గ్రామాన్ని సందర్శించారు. 15 ఏళ్లుగా వంతెన లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎంపీకి విన్నవించుకున్నారు.
వంతెన పనులు నిలిచిపోవడానికి గల కారణాలను అరకు ఎంపీతో మాట్లాడి తెలుసుకుంటానని సప్తగిరి అన్నారు. జోలాపుట్ వంతెన నిర్మాణం జరగకపోవడం వల్ల జలాశయం మీద నుంచి భారీ వాహనాల రాకపోకలతో ప్రాజెక్టు దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తానని వెల్లడించారు.
ఇదీచదవండి.