ఇంటర్లో మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయడంపై మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్ విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారని తెలిపారు. దీనివల్ల రెండు లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండీ... 13 జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామకం