ETV Bharat / state

పుట్టుకతోనే కిడ్నీ లేదు.. అయినా పని మానలేదు!

శరీరంలో అవయవాలన్నీ సక్రమంగా ఉంటేనే కొందరు ఏ పనీ చేయరు. కాస్త ఒంట్లో నలతగా ఉంటే చాలు అమ్మో పనిచేయలేం అంటారు మరికొందరు. ఆమెకు పుట్టుకతోనే ఒక కిడ్నీ లేదు. మరో కిడ్నీ సైజు ఉండాల్సిన దాని కన్నా తక్కువ సైజు ఉంది. అయితేనేం తన పని తాను చేసుకోవడమే కాదు కుటుంబ పోషణ కోసం కుట్టుపని చేస్తోంది. భర్త సంపాదన అంతంతమాత్రం కావటంతో అనారోగ్యాన్ని లెక్కచేయకుండా టైలరింగ్ చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటోంది. అయితే తనకు అందాల్సిన ఏ ఒక్క ప్రభుత్వ పథకమూ అందలేదంటోంది. ప్రభుత్వం స్పందించి ఆదుకుంటే తన కష్టాలు కొంచెమైనా తగ్గుతాయంటోంది ఆ ఇల్లాలు.

kidney-patient-seeking-help-from-government-in-vizag-district
కిడ్నీ పేషెంట్ ఉమ కథనం
author img

By

Published : Jul 6, 2020, 3:11 PM IST

విశాఖ జిల్లా భీమిలి మండలం అమనాం గ్రామానికి చెందిన ఉమకు.. మేనమామ రాముతో 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. భర్త సంపాదన అంతంతమాత్రమే కావటంతో కుటుంబ పోషణ కోసం అప్పటినుంచి టైలరింగ్ చేస్తోంది. గర్భిణిగా ఉన్న సమయంలో పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్తే తెలిసింది ఆమెకు పుట్టుకతోనే ఒక కిడ్నీ లేదని. ఉన్న ఒకటీ ఉండాల్సిన దానికన్నా తక్కువ సైజులో ఉందని. ఇక ఆమె కుట్టుపని చేయకూడదని వైద్యులు సూచించారు.

అప్పుడు తెలిసింది

ఆ విషయం తెలిసి ఒక్క క్షణం నివ్వెరపోయినా తర్వాత తేరుకుంది. వైద్యులు చెప్పినట్లు టైలరింగ్ మానేయలేదు. ఎందుకంటే ఆమె బట్టలు కుడితేనే కుటంబం నడుస్తుంది. కిడ్నీ వ్యాధి వలన ఓ పక్క నడుము నొప్పి, కాళ్ల వాపులు వేధిస్తున్నా పనిచేయక తప్పడం లేదు ఆ మహిళకు. డయాలసిస్ చేయించుకనేంత ఆర్థిక స్తోమత లేక హోమియో మందులతో కాలం నెట్టుకొస్తోంది.

ఆదుకోండి

ఇప్పటివరకు తనకు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛను గానీ.. టైలర్లకు ప్రభుత్వం ఇచ్చే చేదోడు పథకం గానీ ఏవీ అందలేదని వాపోయింది. ఆ డబ్బులు అందితే కొంతవరకు ఆదరవుగా ఉంటుందని ఆశపడుతోంది ఉమ. తాను పథకం కోసం దరఖాస్తు చేసినప్పటికీ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని వేడుకుంటోంది.

'నాకు కిడ్నీ సమస్య ఉంది. అయినా కూడా కుటుంబ పరిస్థితుల కారణంగా పనిచేయాల్సి వస్తోంది. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇప్పటివరకూ ఏ ఒక్క పథకమూ నాకు అందలేదు. ప్రభుత్వం స్పందించి సాయం అందించాలని వేడుకుంటున్నాను.' - ఉమ, టైలర్

-

ఇవీ చదవండి

100 అడుగుల ముందుకు సముద్రం.. ఆందోళనలో మత్స్యకారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.