VRO Disappear: విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ కాపులుప్పాడ వీఆర్వో శ్రీను అదృశ్యంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈనెల 4న వీఆర్వో అదృశ్యమయ్యాడని అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమై పది రోజులైనా అచూకీ లభించలేదని పోలీసులు తెలపడంతో.. వారు భీమునిపట్నం తహసీల్దార్‌కూ వినతి పత్రం అందించారు. వీఆర్వో అదృశ్యంపై పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో చేరుకుని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీఆర్వో కనిపించకుండా పోవడంలో రియల్ మాఫియా హస్తం ఉండొచ్చని బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వీఆర్వో కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: