ETV Bharat / state

Mrugasira Pooja: విశాఖలో వైభవంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర పూజలు

Mrugasira Pooja: విశాఖలో వైభవంగా కనక మహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాస రెండో గురువారం పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి అభిషేకానికి పసుపు జలాలతో పెద్దసంఖ్యలో మహిళలు తరలివచ్చారు.

kanakamahalaxmi  mrugasira masa prayers started

author img

By

Published : Dec 16, 2021, 9:23 AM IST

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస రెండో గురువారం పూజలు విశాఖలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పాత నగరం బురుజుపేటలో కొలువైన అమ్మవారికి అర్ధరాత్రి 12 గంటల తర్వాత అభిషేకం తొలిపూజను నిర్వహించారు. అమ్మవారి అభిషేకానికి మొక్కుబడులు సమర్పించేందుకు మహిళలు కలశాలతో పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా తరలి వచ్చారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు ఈవో మాధవి వెల్లడించారు. పాత నగరంలో భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మార్గశిర మాస పూజల సందర్భంగా అమ్మవారిని మేయర్ గొలగాని వెంకట హరి కుమారి, ఎమ్మెల్సీ మాధవ్, డిప్యూటీ మేయర్ శ్రీధర్ తదితర ప్రముఖులు దర్శించుకున్నారు.

ఇదీ చదవండి:

Bus fire in prakasam: ప్రకాశం జిల్లాలో ప్రైవేటు బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.