విశాఖ జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీలోని కల్యాణపులోవ జలాశయ నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. 3, 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటిమట్టం ఆశాజనకంగా ఉంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా.. 4 రోజుల క్రితం వరకు 435 అడుగులు ఉంది. తాజా వర్షాలకు 35 క్యూసెక్కుల నీరు చేరటంతో.. 450 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి...