విశాఖ నగరంలో అనేక సందర్శనీయ ప్రదేశాలున్నా.. కైలాసగిరి ప్రత్యేకత వేరు. పని మీద విశాఖ వచ్చిన వారు కైలాసగిరిని సందర్శించే వెళ్తుంటారు. కొండ పైనున్న వ్యూపాయింట్లు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. లాక్‌డౌన్ వల్ల కళతప్పిన కైలాసగిరికి..సందర్శకుల తాకిడి ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. పర్యాట కశోభతో ఆకట్టుకుంటోంది.
పర్యాటకులు రాక పెరగడంతో వ్యాపారుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. లాక్‌డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయామని.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు. కైలాసగిరిని మరింత సుందరంగా తీర్చిదిద్దే దిశగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పర్యాటకులకు ఇబ్బంది లేకుండా పనులు చేపడుతున్నారు.
ఇదీ చదవండి: కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు-15 మంది మృతి