భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందన్న జేఎన్యూ ఆచార్యురాలు మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఒక తప్పిదం మాత్రమే కాదు దేశ ప్రజలకు వ్యతిరేకంగా చేసిన పెద్ద ఆర్థిక నేరమని జేఎన్యూ ఆచార్యురాలు జయతీ ఘోష్ విమర్శించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో భారతీయ బీమా ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. కార్యక్రమంలో 'భారతీయ ఆర్థిక వ్యవస్థ, దారి తీసే పరిణామాలు, తీసుకోవాల్సిన చర్యలు' అనే అంశంపై ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా 2008లో ఆర్థిక సంక్షోభం కంటే తీవ్రమైన సంక్షోభాన్ని భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటుందని అన్నారు. పారిశ్రామిక రంగం పూర్తిగా దెబ్బతిందనీ.. దేశంలో మిలియన్ల ఉద్యోగాలు పోయాయన్నారు. దేశంలో జాతీయ ఆదాయం పెరుగుతున్నా, వేతనాలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయని తెలిపారు. ప్రధాని మోదీ కాలంలో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమైందని విమర్శించారు. దేశంలో అన్ని రంగాలు కుదేలవుతున్నా, పెట్టుబడిదారులు, వ్యాపారుల రాయితీలు, కార్మిక చట్టాలు మరింత కఠిన తరం చేయాలనే డిమాండ్ వల్లే ఈ వైపరీత్యాలు జరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల వల్ల తెలుగు ప్రజలపై ప్రభావం లేదని తెలిపారు. కానీ దేశంలోనే అత్యధిక అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు ఉందని అన్నారు.ఇదీ చదవండి:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల