విశాఖలోని గిరిజన కో-ఆపరేటివ్ కార్పోరేషన్ (జీసీసీ) కార్యాలయాన్ని ఝార్ఖండ్ ప్రతినిధులు సందర్శించారు. జీసీసీ ఎండీతో ఝార్ఖండ్ మార్కెటింగ్ కోపరేటివ్ ఫెడరేషన్ ఎండీ భేటీ అయ్యారు. 2 సంస్ధల మధ్య ఐదు అంశాలపై ఒప్పందాలు జరిగాయి. రెండు సంస్ధల ఉత్పత్తులు ఝార్ఖండ్, ఏపీలో అమ్మేందుకు అంగీకారం కుదుర్చుకున్నారు. ఝార్ఖండ్ కరంజి తేనెను జీసీసీ ద్వారా అమ్మేందుకు ఒప్పందం జరిగింది. ఝార్ఖండ్ చిరంజి గింజలను ఏపీలో విక్రయించేందుకు జీసీసీ అంగీకారం తెలిపింది. రాంచీలో అరకు కాఫీ విక్రయానికి ఒప్పందం చేసుకున్న అధికారులు... ఝార్ఖండ్ ఉత్పత్తుల విలువ పెంచేలా ప్యాకింగ్, బ్రాండింగ్‌లో జీసీసీ సహకారంపై చర్చించారు.
ఇదీ చదవండీ...