అంగన్వాడీ పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలంటూ విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టరేట్ వద్ద జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనతో ప్రమేయమున్న రాజకీయ నేతలపై చర్యలు తీసుకోవాలని.. రాజన్న సూర్యచంద్ర అధ్యక్షతన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సబ్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసి.. అవకాశం కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి: 'ఆదివాసీలకు అందుబాటులోకి అత్యాధునిక కంటి వైద్యసేవలు'