ETV Bharat / state

JanaSena Leaders Harsh Comments on CM Jagan: 'వెనుకబాటు' నాలుగేళ్లకు గుర్తొచ్చిందా..? విశాఖ వచ్చేందుకు డొంకతిరుగుడు వేషాలు : జనసేన - janasena leaders news

JanaSena Leaders Harsh Comments on CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ వచ్చేందుకు డొంకతిరుగుడు వేషాలు వేస్తున్నారని జనసేన పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రుషికొండపై సీఎం క్యాంప్ ఆఫీసు నిర్మాణం జరుగుతోందని, 9.88 ఎకరాలపై తవ్వకాలకే అనుమతి పొంది, 22 ఎకరాలు తవ్వి ఉల్లంఘనలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

JanaSena_Leaders_Comments
JanaSena_Leaders_Comments
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2023, 5:05 PM IST

Updated : Oct 12, 2023, 7:19 PM IST

JanaSena Leaders Harsh Comments on CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దసరా తర్వాత విశాఖపట్నం జిల్లా నుంచి పరిపాలన సాగిస్తామని పలుమార్లు జగన్ చేసిన వ్యాఖ్యలకు తగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వుల్లో.. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, వసతి సదుపాయం, మంత్రులు, సీనియర్‌ అధికారులకు ట్రాన్సిట్‌ వసతి గుర్తింపు కోసం అధికారుల కమిటీని నియమిస్తున్నట్లు పేర్కొంది.

'వెనుకబాటు' నాలుగేళ్లకు గుర్తొచ్చిందా..? విశాఖ వచ్చేందుకు డొంకతిరుగుడు వేషాలు : జనసేన

Janasena Fire on Govt Orders: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును సీఎం సమీక్షించాల్సి ఉందని, దీని కోసం ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉండాల్సిన అవసరం ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉత్తర్వులపై, సీఎం జగన్‌పై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, పి.ఎస్.ఎన్ రాజులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖ వచ్చేందుకు సీఎం జగన్ డొంకతిరుగుడు వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు.

Jana Jagarana Samiti on CM Jagan విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడలేనివాడు ఉత్తరాంధ్రను ఎలా ఉద్ధరిస్తాడు?: జన జాగరణ సమితి

Murthy Yadav Fire on Rishikonda Excavations: సీఎం జగన్ విశాఖ పరిపాలన, రిషికొండ తవ్వకాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, చోడవరం ఇన్‌ఛార్జ్ పి.ఎస్.ఎన్ రాజు విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ..''విశాఖ వచ్చేందుకు జగన్ డొంకతిరుగుడు వేషాలు వేస్తున్నారు. రుషికొండపై సీఎం క్యాంప్ ఆఫీసు నిర్మాణం జరుగుతోంది. రుషికొండపై 9.88 ఎకరాలపై తవ్వకాలకే అనుమతి పొందారు. కానీ, రుషికొండపై 22 ఎకరాలు తవ్వి, ఉల్లంఘనలకు పాల్పడ్డారు. రుషికొండపై పర్యవరణ అనుమతులను ఉల్లంఘించారు. రుషికొండ తవ్వకాలపై సీఆర్‌జెడ్‌ ఉల్లంఘనలు జరిగాయి. అమరావతి నుంచి ఆఫీసులు తరలించొద్దని కోర్టులు చెప్పాయి.'' అని ఆయన అన్నారు.

Murthy Yadav Comments: ముఖ్యమంత్రి జగన్ వైనాట్ 175 అని ప్రగల్భాలు పలుకుతున్నారని.. మూర్తి యాదవ్ ధ్వజమెత్తారు. రిషికొండపై సర్వే నెం 19లో టూరిజం రీడెవలప్మెంట్ పేరుతో సీఎం క్యాంప్ కార్యాలయం నిర్మాణం జరుగుతున్నట్లు తేటతెల్లమైందన్నారు. రుషికొండపై తవ్వకాలకు 9.88 ఎకరాలకు మాత్రమే అనుమతులు పొంది, 22 ఎకరాల వరకూ తవ్వారని ఆగ్రహించారు. నాలుగున్నరేళ్లలో ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు.

YV Subbareddy Key Comments on CM Jagan Shifting: విజయదశమి నుంచి పరిపాలనా రాజధానిగా విశాఖ: వైవీ సుబ్బారెడ్డి

Chodavaram Janasena in-charge PSN Raju Comments: అనంతరం చోడవరం జనసేన ఇన్‌ఛార్జ్ పి.ఎస్.ఎన్ రాజు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రపై వైఎస్సార్సీపీ కపట ప్రేమ చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో మొత్తం 35 అసెంబ్లీ స్ధానాలను వైసీపీ కోల్పోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. లండన్, బెంగళూరుల్లో ఉన్న ఆస్తులతోపాటు విశాఖలో సంపాదించిన ఆస్తులను సమీక్షించడానికి వస్తున్నారా జగన్..? అని ప్రశ్నించారు. సీఎం వస్తున్నారని రూ.270 కోట్లు వెచ్చించి రుషికొండపై నిర్మాణాలు చేయడం దారుణమన్నారు.

'అందుకోసమే.. జగన్ విశాఖ రాగం'

Last Updated : Oct 12, 2023, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.