ఆపదలో ఉన్నవారికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అనకాపల్లి పార్లమెంటరీ వర్కింగ్ కమిటీ సభ్యుడు మూర్తి అన్నారు. విశాఖ జిల్లా చీడికాడ మండలం బైలపూడిలో నిరుపేద కుటుంబానికి చెందిన పట్నాల అప్పలరాజు మెదడులో శస్త్రచికిత్స జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అప్పలరాజు కుటుంబానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత కలిసి రూ.30 వేలు నగదు, కుటుంబానికి నెల రోజులు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు.
ఇవీ చదవండి: విశాఖలో తెదేపా శ్రేణులను నిర్బంధించిన పోలీసులు