జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్లో శుక్రవారం బెల్లం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి రైతులు తీసుకొచ్చిన 8,253 దిమ్మలకు బహిరంగ వేలం పాట నిర్వహించారు. కరోనా నేపథ్యంలో.. ఈ నెల 5 నుంచి యార్డ్‌ని మూసివేశారు. దీంతో రైతులు తయారు చేసిన బెల్లం పంట పొలాల వద్ద ఉండిపోయింది.
15 రోజుల అనంతరం యార్డు తెరుచుకోవటంతో బెల్లం దిమ్మలు అధికంగా వచ్చాయి. రంగు బెల్లం 10 కిలోల ధర రూ.381 పలకగా.. మద్యకరం రూ.330, నాసిరకం రూ.290 ధర పలికింది. ఇతర రాష్ట్రాల్లో బెల్లానికి డిమాండ్ ఏర్పడటం, సరకు తక్కువగా రావటం ధరల పెరుగుదలకు కారణంగా వ్యాపారులు తెలిపారు. తిరిగి మంళవారం అమ్మకాలు చేపడతారు. రైతులు తయారు చేసిన బెల్లాన్ని సోమవారం తీసుకోవాలని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: