ETV Bharat / state

కేజీహెచ్​ సీఎస్ఆర్ కొవిడ్ బ్లాక్​లో పర్యటించిన ఐటీడీఏ పీవో - kgh CSR covid Block news

విశాఖ జిల్లా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల.. కేజీహెచ్​లోని సీఎస్ఆర్ కొవిడ్ బ్లాక్​లో పర్యటించారు. కరోనా బాధితులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

covid care center
బాధితులను పరామర్శిస్తున్న అధికారి
author img

By

Published : May 15, 2021, 6:59 PM IST

విశాఖ జిల్లా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ సలిజామల పీపీఈ కిట్ ధరించి కేజీహెచ్​లోని సీఎస్ఆర్ కొవిడ్ బ్లాక్​ను సందర్శించారు. కరోనా బాధితులను పరామర్శించి.. కేసు షీట్లను పరిశీలించారు. ధైర్యంగా ఉండాలని… వైద్యులు ఇచ్చిన మందులు సమయానికి వేసుకోవాలని రోగులకు చెప్పారు. బాధితులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని సిబ్బందికి సూచించారు.

భోజనం సరఫరా బాగుందని కొవిడ్ బాధితులు చెప్పడంతో ప్రాజెక్ట్ అధికారి సంతృప్తి వ్యక్తం చేశారు. షిఫ్టు డ్యూటీ సహాయ ప్రొఫెసర్.. విధులకు హాజరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ డా.మైథిలిని ఆదేశించారు. డ్యూటీ వైద్యులు, స్టాఫ్ నర్సులు సక్రమంగా విధులు నిర్వర్తించాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం శానిటైజేషన్​ చేయాలని చెప్పారు. సూపర్ స్పెషలిటీ వార్డుల్లో మరుగుదొడ్లు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్​ఎన్​వో, ఎంఎన్​వోలు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి: ఆళ్ల నాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.