రాష్ట్రంలో ఎక్కువ మందికి అత్యవసర కొవిడ్ వైద్య సేవలందించే కేజీహెచ్ సీఎస్ఆర్ బ్లాక్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. గత వారం రోజులుగా పాడేరు ఐటీడీఏ పీవో డాక్టర్ సలిజాల వెంకటేశ్వర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించటంతో పరిస్ధితిని కొంత వరకు కొలిక్కి తీసుకురాలగలిగారు.
ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో వచ్చే లోటు పాట్లను గుర్తించి సరిచేయడం, మృత దేహాలను వెంటనే తొలగింపు కోసం పారిశుద్ద్య కార్మికుల అందుబాటులో ఉంచటం వంటి సమస్యలను పరిష్కరించగలిగినట్లు డాక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు.
రానున్న రోజుల్లో మరింత మంది బాధితులకు చికిత్స అందించేందుకు వీలుగా తిరుపతిలో మాదిరిగా ప్రత్యేక ఏర్పాట్లు కేజీహెచ్‌లో అందుబాటులోకి రానున్నాయన్నారు. గిరిజన మండలాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోందని అందుకు అనుగుణంగా కొవిడ్ కేంద్రాలను మరిన్ని ఏర్పాటు చేస్తున్నామని వెంకటేశ్వర్ తెలిపారు.
ఇదీ చదవండి: