ETV Bharat / state

మొబైల్ డేటాను రికవరీ చేసుకోవడం సాధ్యమేనా..? - మొబైల్ డేటాను రికవరీ వార్తలు

మొబైల్ ఫోన్ చేతిలో లేకుండా ఇప్పుడు ఏ పనీ జరగడం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే చరవాణి ఇప్పుడు ఓ చిన్న కంప్యూటర్‌ పరికరంగా మారిపోయింది. ఫొటోలు, వీడియోలు మొదలు డాక్యుమెంట్లు వంటి కీలకమైన సమాచారం సైతం మొబైల్‌లోనే దాచుకుంటున్నాం. పొరపాటున ఈ డేటా డిలీట్‌ అయినా... అనుకోకుండా ఫోన్ నుంచి పోయినా ఆ వినియోగదారుడి పరిస్థితి ఎంత గందరగోళంగా మారుతుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ పరిస్థితి మనకే వస్తే ఏం చేయాలి... మొబైల్ డేటాను రికవరీ చేసుకోవడం అసలు సాధ్యమేనా..? ముందస్తుగా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఫోన్లో చేసుకోవడం ద్వారా మనం డేటాను భద్రంగా ఉంచుకోగలం... ఇలాంటి విషయాలకు సంబంధించి విశాఖ నుంచి గీతం వర్సిటీ ఆచార్యులు, డాక్టర్. కామాక్షయ్యతో మా ప్రతినిధి అనిల్ ముఖాముఖి.

మొబైల్ డేటాను రికవరీ చేసుకోవడం అసలు సాధ్యమేనా?

author img

By

Published : Jan 31, 2021, 7:20 PM IST

మొబైల్ డేటాను రికవరీ చేసుకోవడం అసలు సాధ్యమేనా?

మాయలఫకీర్‌ ప్రాణం రామచిలుకలో దాగి ఉన్నట్లు... ఇప్పుడు మన ప్రాణాలు మెుబైల్‌ ఫోన్‌లో దాగి ఉన్నాయి. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌ పక్కన ఉండాల్సిందే. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా... మనం కూడా సమాజంలో ఉన్నామని పదిమంది గుర్తించాలన్నా... అన్నింటికి ఫోనే మూలం. మరీ, అన్ని విషయాలు ఫోన్‌లో ఉంటే.. అనుకోకుండా ఏదైనా సమాచారం పోతే పరిస్థితి ఏంటి..? కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ మాదిరి రికవరీ చేసుకోలేం కదా..! ఈ నేపథ్యంలో... మెుబైల్‌లో డేటాను రికవరీ చేసుకోవడం సాధ్యమేనా...? థర్డ్‌పార్టీ యాప్స్‌ ఎంత వరకు సురక్షితం..? ఆండ్రాయడ్‌ వెర్షన్‌ 11లో డేటా రికవరీ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుందా..? వంటి సమగ్ర విషయాలను డేటా సైన్స్‌ నిపుణులు ప్రొఫెసర్‌. కామాక్షయ్య వివరించారు.

ఇవీ చదవండి

రుషికొండ వద్ద మరో భారీ ప్రాజెక్టు రూపకల్పనకు సన్నాహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.