ETV Bharat / state

చదువులపై ఆర్తి...ర్యాంకులతో స్ఫూర్తి

ఈసెట్‌-2020 ఫలితాల్లో విశాఖ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకుతో పాటు వివిధ విభాగాల్లో టాప్‌-10 లోపు ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ర్యాంకర్లు పేర్కొన్నారు.

Inspired by ranks on studies
చదువులపై ఆర్తి...ర్యాంకులతో స్ఫూర్తి
author img

By

Published : Oct 7, 2020, 3:14 PM IST

ఈసెట్‌-2020 ఫలితాల్లో విశాఖ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకుతో పాటు వివిధ విభాగాల్లో టాప్‌-10 లోపు ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ర్యాంకర్లు పేర్కొన్నారు.

ఉద్యోగం చేస్తూనే..

నక్కపల్లిలో ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులపై ఆసక్తితో కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో రాష్ట్రస్థాయిలో తొమ్మిదో ర్యాంకు సాధించాడు డొంకాడకు చెందిన నాయుడు రాజేష్‌. ఈయన తండ్రి అప్పారావు వ్యవసాయం చేస్తుండగా, తల్లి గృహిణి. కొద్ది నెలల క్రితం స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం లభించింది. ఏయూలో సీటు వస్తే బీటెక్‌ పూర్తి చేస్తానని రాజేష్‌ తెలిపాడు.

రైతుబిడ్డకు మొదటి ర్యాంకు

ఎస్‌.రాయవరం ఏపీ ఈసెట్‌ ఫలితాల్లో ఎస్‌.రాయవరం మండలం భీమవరం గ్రామానికి చెందిన గరగా అజయ్‌ రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. అజయ్‌ తండ్రి కృష్ణ వ్యవసాయం చేస్తుండగా, అమ్మ లక్ష్మి గృహిణి. అజయ్‌ పదో తరగతిలో 9.7 పాయింట్లు సాధించాడు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో మెకానికల్‌ డిప్లమో పూర్తి చేశాడు. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని, ఇంజినీరింగ్‌ తరవాత గేట్‌ రాసి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నత ఉద్యోగం సాధించాలనేది తన లక్ష్యమని అజయ్‌ ‘న్యూస్‌టుడే’ తెలిపాడు.

మెటలర్జికల్‌లో ర్యాంక్‌ల పంట

అనకాపల్లి ఈసెట్‌ ఫలితాల్లో అనకాపల్లి విద్యార్థులు ప్రతిభ చూపారు. మెటలర్జికల్‌ విభాగంలో సత్యనారాయణపురం పంచాయతీకి చెందిన రామోజు పవన్‌తేజ 2వ ర్యాంక్‌, తుమ్మపాల చినబాబు కాలనీకి చెందిన విద్యార్థినీ ఆచంట ప్రసన్నదేవి 6వ ర్యాంక్‌, సత్యనారాయణపురం పంచాయతీ మూలపేటకు చెందిన కర్రి డేవిడ్‌బూన్‌ 7వ ర్యాంక్‌, తుమ్మపాల కొత్తపేటవీధికి చెందిన షేక్‌ ఆలీ యాషీన్‌ 10వ ర్యాంక్‌ దక్కించుకున్నారు. కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అనకాపల్లి గాంధీనగరం ప్రాంతానికి చెందిన దిట్టకవి ఆరుద్ర బాలభరద్వాజ్‌ 5వ ర్యాంక్‌, ఈసీఈ విభాగంలో లక్ష్మిదేవిపేటకు చెందిన దేశెట్టి కుసుమాంజలి 10వ ర్యాంక్‌ సాధించాడు.

పట్టుదలతో సాధించారు..!

రోలుగుంట, న్యూస్‌టుడే: భోగాపురం గ్రామానికి చెందిన నర్సింహరావు, పద్మలతల కుమారుడు ముక్కు హేమంత్‌ ఈసెట్‌ కెమికల్‌ ఇంజినీరింగు విభాగంలో ఏడో ర్యాంకు సాధించాడు. హిందూస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌.పి.సి.ఎల్‌)లో ఉన్నత ఉద్యోగం సంపాదించడమే తన లక్ష్యమని హేమంత్‌ పేర్కొన్నాడు.

అచ్యుతాపురంలో ఈసెట్‌ ఫలితాల్లో అచ్యుతాపురం మండలం జంగుళూరుకు చెందిన విద్యార్థి ప్రతిభ చూపాడు. గ్రామానికి చెందిన లాలం జగదీష్‌ మెకానికల్‌ విభాగంలో రాష్ట్రస్థాయిలో 28వ ర్యాంకు సాధించాడు. నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లమో చదువుతున్న జగదీష్‌ రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

జోడుగుళ్లపాలెంకు చెందిన వాసుపల్లి కీర్తి 159 మార్కులతో పదో ర్యాంక్‌ సాధించింది. తండ్రి సత్తిరాజు హెచ్‌పీసీఎల్‌లో కాంట్రాక్టు ఉద్యోగి, తల్లి శ్రీదేవి గృహిణి.

శిక్షణ లేకుండానే ఏడో ర్యాంక్‌

నర్సీపట్నం అర్బన్‌: సివిల్‌ ఇంజినీర్‌ కావాలన్నదే తన ఆశయమని ఈ-సెట్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో రాష్ట్ర ఏడో ర్యాంకర్‌ నరం సత్యసావిత్రి అన్నారు. ఆమె నర్సీపట్నంలోని ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ, విజయనగరం జేఎన్‌టీయూలో ఎంసీఏ పూర్తి చేశారు. ఇంటివద్దనే చదువుకుని సన్నద్ధమయ్యారు. తండ్రి ఎలక్ట్రీషియన్‌, తల్లి గృహిణి అని చెప్పారు.

పెందుర్తికి చెందిన యర్ర జగదీశ్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పదో ర్యాంకు పొందాడు. తండ్రి మహాలక్ష్మీ పోర్టులో కూలీగా చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. తల్లి రమణమ్మ గృహిణి. కరోనాకు ముందు నుంచి పరీక్ష కోసం సన్నద్ధమయ్యా. నేను ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్‌ వాడటం లేదు.

అమ్మ కోరిక నెరవేరుస్తా..: కోటనరవకు చెందిన మళ్ల నందిని సాయి కెమికల్‌ విభాగంలో నాలుగో ర్యాంకు పొందింది. తండ్రి లక్ష్మణరావు రైతు, తల్లి అరుణ అకాల మరణం పొందారు. నేను బాగా చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని అమ్మ అంటుండేది. అందుకే ఇంటి పనులు చేసుకుంటూ రోజుకు 8గంటలకు పైగానే చదివి ర్యాంకు సాధించా. ప్రభుత్వ ఉద్యోగం సాధించి అమ్మ కోరిక నెరవేరుస్తా..

మెకానికల్‌ ఇంజినీరవుతా..

పరవాడకు చెందిన మండల సురేశ్‌ మెకానికల్‌లో 18వ ర్యాంకు పొందాడు. తల్లిదండ్రులు ముత్యాలనాయుడు, నాగమణి వ్యవసాయం చేస్తారు.

పరవాడ: వాడచీపురుపల్లికి చెందిన వెంపాడ ప్రమీల ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఎనిమిదో ర్యాంకు సాధించింది. తండ్రి పెంటారావు ఎన్టీపీసీ ఒప్పంద కార్మికునిగా పనిచేస్తున్నారు. తల్లి సత్యవతి గృహిణి.

సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెంకు చెందిన గోకాడ మోహన్‌కుమార్‌ అగ్రికల్చర్‌లో నాలుగో ర్యాంకు పొందాడు. తండ్రి గోకాడ చినబాబు వ్యవసాయం చేస్తారు.. తల్లి రాము. గృహిణి. గతేడాది ఇతడికి 20వ ర్యాంకు వచ్చింది. మూడో ప్రయత్నంలో నాలుగో ర్యాంకు సాధించానన్నాడు. రైతుల కష్టాలు తెలుసు. వారికి పరికరాలను అద్దెకిచ్చే సెంటర్‌ ఏర్పాటు చేసి చేయూతనివ్వాలని భావిస్తున్నానన్నాడు.

విశాఖకు చెందిన కట్టా నవ్యశ్రీ ఫార్మసీ విభాగంలో 11వ ర్యాంకు సాధించింది. తండ్రి ఈశ్వరరావు సెల్స్‌మేన్‌గా పనిచేన్నారు. భవిష్యత్తులో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా స్థిరపడతానని తెలిపింది.

విశాఖ అక్కయ్యపాలెంకు చెందిన పొలమరశెట్టి సాయి ప్రత్యూష మూడో ర్యాంకు సాధించింది. నాన్న ప్రసాద్‌ పోర్టు ఉద్యోగి, అమ్మ రూపలక్ష్మి గృహిణి.

వ్యవసాయ కుటుంబం నుంచి..

ఎస్‌.రాయవరం: సివిల్‌ ఇంజనీరింగ్‌లో ఉన్నత ఉద్యోగం సాధించడమే లక్ష్యమని సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో పదో ర్యాంకర్‌ ఎం.ఎస్‌.ఎన్‌.ముకేష్‌ అన్నారు. పెనుగొల్లుకు చెందిన ముకేష్‌ తండ్రి రాము వ్యవసాయం చేస్తుండగా, తల్లి లక్ష్మి గృహిణి. పదో తరగతిలో 9.7 గ్రేడ్‌ పాయింట్లు సాధించి, విజయనగరం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో డిప్లమో పూర్తి చేశాడు.

ఇదీ చదవండి:

జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.