ఇదీ చదవండి :
మనీలా, ఫిలిప్పైన్స్ పర్యటనకు కిల్టన్, సహ్యాద్రి నౌకలు - Indian navy exercise in manila, Philippines
భారత నౌకాదళానికి చెందిన కిల్టన్, సహ్యాద్రి నౌకలు నేటి నుంచి ఈ నెల 26 వరకూ మనీలా, ఫిలిప్పైన్స్ దేశాల్లో పర్యటించనున్నాయి. భారత నౌకాదళం, ఆ రెండు దేశాల నావికాదళాలతో కలిసి సంయుక్త విన్యాసాలు చేయనున్నాయి. అనంతరం భారత నేవీ సిబ్బంది ఇరు దేశాల నేవీ అధికారులతో సమావేశమవుతారు.
మనీలా, ఫిలిప్పైన్స్ పర్యటనకు కిల్టన్, సహ్యాద్రి నౌకలు
భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ కిల్టన్, సహ్యాద్రి నౌకలు... విదేశీ సహాకారంలో భాగంగా మనీలా, ఫిలిప్పైన్స్ దేశాలలో పర్యటించనున్నాయి. నేటి నుంచి 26వ తేదీ వరకు ఈ నౌకలు ఆ దేశాల్లో పర్యటిస్తాయి. దక్షిణాసియా, పశ్చిమ పసిఫిక్ దేశాలతో నౌకాదళ సంబంధాలు పెంపొందించడంలో భాగంగా ఈ పర్యటనలు సాగనున్నాయి. ఈ రెండు నౌకలు దేశీయంగా రూపొందించిన యాంటి సబ్మెరైన్ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తాయి. శత్రు దేశాల రాడార్లకు అందకుండా పురోగమించే సాంకేతికత వీటిల్లో ఉంది. మనీలా, ఫిలిప్పైన్స్ నేవీలతో భారత నౌకాదళానికి చెందిన అధికారులు సమావేశమవుతారు. వారి నౌకలను సందర్శిస్తారు. ఆ రెండు దేశాల నేవీలతో కలసి భారత నౌకాదళ సిబ్బంది సంయుక్త విన్యాసాలు చేయనున్నారు.
ఇదీ చదవండి :
sample description
TAGGED:
Indian navy latest news