ఈ నెల 1న ఒక సారి, 15న మరోసారి రెండు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచింది. విడతకు 50 చొప్పున గృహ వినియోగదారులపై సుమారు వంద రూపాయల భారం మోపాయి. విశాఖ జిల్లాకు సంబంధించి 6.88 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ప్రతినెల సిలిండర్ బుక్ చేసుకుంటారు. ఈ లెక్కన చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఒక్క డిసెంబర్ నెలలోనే వినియోగదారులపై సుమారు 6 . 88 కోట్ల భారం పడినట్లైంది.
సాధారణంగా సిలిండర్ ధర పెరిగినప్పుడు వినియోగదారులు ఆ మొత్తం చెల్లిస్తే ఆ మేరకు సబ్సిడీ డబ్బు బ్యాంకు ఖాతాలో జమయ్యేది. ఇప్పుడు అలా కావటం లేదు. ఈ ఏడాది మొదట్లో సబ్సిడీ మొత్తం 185 వరకూ వచ్చేది . గత నాలుగు నెలలుగా రూ.3.50 మాత్రమే వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమవుతుంది. డిసెంబరు ఒకటో తేదీ వరకు సిలిండర్ కోసం 602 రూపాయలు చెల్లిస్తే...ప్రస్తుతం 702 రూపాయలు చెల్లించాల్సివస్తోంది.
ఇటు ఆయిల్ కంపెనీల యాజమాన్యాలు, డీలర్లు సిలిండర్ ధర పెంపు రాయితీలపై స్పష్టతనివ్వటం లేదు. పాలకుల మాత్రం సిలిండర్ ధర పెరిగినా..గృహ వినియోగదారులకు ఆ మేరకు సబ్సిడీ వస్తుందని చెబుతున్నారు. కానీ అవన్నీ అవాస్తవాలని బ్యాంకు ఖాతాల్లో జమవుతున్న మొత్తాలను చూస్తే అర్థమవుతోంది. ప్రభుత్వం ఇచ్చే రాయితీ క్రమంగా ఎత్తేస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీచదవండి
సీబీఐ విచారణ జరిపించకుంటే.. ఆధారాలు బయటపెడతాం: అయ్యన్నపాత్రుడు