ETV Bharat / state

మన్యంలో.. కాబోయే అమ్మలకు తప్పనున్న కష్టాలు - visakha distrcit latest news

విశాఖ ఏజెన్సీ చింతపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సమీపంలో గర్భిణుల కోసం వసతిగృహాన్ని ఏర్పాటు చేశారు. గర్భిణుల కోసం గతంలో నిర్మించిన సామాజిక భ‌వ‌నాన్ని.. గ‌ర్బిణుల వ‌స‌తిగృహంగా మార్చారు. దీంతో విశాఖ మన్యంలో కాబోయే అమ్మలకు డోలిమోత కష్టాలు తప్పనున్నాయి.

inaugurated the hostel for pregnant woman's at chintapalli
చింత‌ప‌ల్లిలో గ‌ర్భిణీల‌ కోసం వ‌స‌తిగృహం
author img

By

Published : Nov 1, 2021, 10:41 PM IST

విశాఖ మన్యంలో తరచూ డోలీమోతలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. సరైన రహదారి, రవాణా సదుపాయాలు లేకపోవడంతో ప్రసూతి సమయం వరకూ ఇళ్ల వద్దే ఉండిపోతున్నారు. ఈ పరిస్థితి ఒక్కోసారి వారి ప్రాణాలమీదకూ తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో మన్యంలో డోలీమోతలు తప్పేలా ఐటీడీఏ చర్యలు చేప‌ట్టింది. చింతపల్లి కేంద్రంగా గర్భిణుల కోసం గతంలో నిర్మించిన సామాజిక భ‌వ‌నాన్ని గ‌ర్బిణుల వ‌స‌తిగృహంగా మార్పులు చేసింది. ఈ వ‌స‌తి గృహాన్ని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గోపాల‌కృష్ణ‌, ఎమ్మెల్యే భాగ్య‌ల‌క్ష్మి ప్రారంభించారు.

ఈ భవనంలో 10 బెడ్లు ఏర్పాటు చేశామని.. డెలివరీకి ప‌క్షం రోజులుముందునుంచే మారుమూల ప్రాంతాల‌కు చెందిన గ‌ర్బిణుల‌కు ఇక్కడ వైద్య‌సేవ‌లు అందించనున్నట్టు అద‌న‌పు డీఎంహెచ్‌వో తెలిపారు. గర్భిణులకు పౌష్టికాహార కోసం ఒక్కరికి రోజుకి రూ.240 ప్రభుత్వం కేటాయించిందని.. ఈ అవకాశం వినియోగించుకోవాలని ఎమ్మెల్యే భాగ్య‌ల‌క్ష్మి కోరారు.

ఈ వసతి గృహంలో చేరే మహిళలకు వైద్యుల పర్యవేక్షణలో కాన్పు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేశామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గోపాల‌కృష్ణ‌ చెప్పారు. ఈ ప్రాజెక్టును ప్ర‌యోగాత్మ‌కంగా ఏర్పాటు చేశామని.. త్వరలో మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

ఇదీ చదవండి..

Amaravati Farmers: 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' మహా పాదయాత్ర.. తొలిరోజు సాగిందిలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.