ETV Bharat / state

‘మిక్సోపతి’కి వ్యతిరేకంగా పోరు.. ఐఎంఏ జాతీయ నేతల వెల్లడి - ap latest news

కేంద్ర ప్రభుత్వం మిక్సోపతి వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన సీసీఐఎం సవరణ బిల్లకు వ్యతిరేకంగా పోరు చేస్తున్నట్లు ఐఎంఏ జాతీయ నేతలు వెల్లడించారు.

ima-national-leaders-reveal-they-are-fighting-against-the-ccim-amendment-bill
‘మిక్సోపతి’కి వ్యతిరేకంగా పోరు.. ఐఎంఏ జాతీయ నేతల వెల్లడి
author img

By

Published : Oct 4, 2021, 10:22 AM IST

కేంద్ర ప్రభుత్వం మిక్సోపతి వైద్య విధానాలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌ (సీసీఐఎం) సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరు సాగిస్తున్నామని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ జె.ఎ.జయలాల్‌, సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ జయేష్‌ ఎం.లెలె తెలిపారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ ఎన్‌.సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ జి.నందకిషోర్‌ తదితరులతో కలిసి వారు ఆదివారం విశాఖలో మాట్లాడారు.

కొద్దిపాటి శిక్షణతో ఆయుర్వేద వైద్యులు ఎలా సర్జరీలు చేస్తారని ప్రశ్నించారు. కేంద్ర విధానాలపై కోర్టులో న్యాయ పోరాటం చేస్తూనే ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 1900 మంది వైద్యులు కొవిడ్‌తో మృతి చెందగా, వారిలో 198 మందికి మాత్రమే కేంద్రం ప్రకటించిన రూ.50లక్షల పరిహారం అందిందని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో 110 మంది వైద్యులు మృతి చెందారన్నారు. వారిలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఐఎంఏ సహాయం అందజేస్తోందని, ఇంత వరకు 30 మందికి ఇచ్చినట్లు వివరించారు.

ఇదీ చూడండి: R AND B ENGINEERS: 'రండి.. రహదారుల టెండర్లు వేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.